ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 26| 16th July 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 26

వక్తలు :

  1. శ్రీమతి నండూరి సువర్చలా దేవి, హైదరాబాద్
  2. శ్రీమతి కోర్ర వరలక్ష్మి,కాకినాడ

55వ పద్యము.
పరమపవిత్ర యీ వెలది పండితురాలు నితాంత సత్యసం
భరితరసాత్మక ప్రకృతి వడ్డికిబారెడు ప్రేమమూర్తి సుం
దర సముపాసితంబయిన ధర్మపదంబును సంతరించి నీ
శ్వరునెద నగ్బరాంబ కడు ప్రార్థన సేయును నెల్లవేళలన్.

56వ పద్యము
పల్లెన్ బుట్టిన ఢిల్లీలో బ్రిటిషు సామ్రాజ్యంబు పాలించువా
రెల్లన్ వచ్చి సమాధి జేసిరి భవన్మృత్యున్ విచారించి యో
పుల్లాబ్జానన “అగ్బరాంబిక” భవత్పుణ్యంబు దేశాల రా
జిల్లున్ విచ్చినకుండఁబోలె వెస నే జీరాడుచున్నానిటన్.

You may also like...