ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 29| 06th August 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 29

వక్తలు :

  1. శ్రీమతి పసుపులేటి లక్ష్మి, తణుకు
  2. శ్రీమతి మీసాల రాజ్యలక్ష్మి, హైదరాబాద్

62వ పద్యము
ఇది మహదావతారసభ యీశ్వరతత్త్వ మెఱుంగఁగోరు సం
పద గలవార లీబడిని పాఠములట్టుల నేర్చికొంటకై
మొదలిడె నీమతం బఖిలభూతలవాసులు స్వీకరింతు రిం
పొదవ స్వరాజ్యభానుని మహోదయ మిందగు నంచు నమ్ముచున్.

63వ పద్యము
ఈసభ బ్రహ్మవిద్య నెఱింగించెడు తాత్త్వికపాఠశాల నా
నా సముపాసితంబులు ననంతకళాలసితంబులౌ నుప
న్యాసము లిచ్చు సాధకజనంబు వసించెడు కాణయాచి రా
కాసులనైన మోక్షపథగాముల సేయు నటన్న వింతయే.

You may also like...