ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 50| 31st December 2022
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 50
వక్తలు :
- శ్రీమతి సాగి జ్యోతి కుమారి, తాళ్లరేవు, తూగో. జిల్లా
- శ్రీమతి రుద్రరాజు విజయలక్ష్మి, నరసాపురం, పగో. జిల్లా
106 వ పద్యము
లోభికిలేదు మోక్షము యలోకమహామహనీయస త్తపో
వైభవమున్నగాని నిజభక్తుఁడు దానము జేసిచేసి యా
లాభము ధ్యానమందొక కళాసదృశంబుగఁ జూడ నేర్చు నా
నాభయవారకం బయిన నాకము మాటలలోన నున్నదే.
107 వ పద్యము
ఏ జ్ఞాన మెఱిఁగిన నీశ్వరుండను మహా
తేజంబు రూఢమై తేజరిల్లు
ఏ విద్యఁ జదివిన నింద్రియారణ్యముల్
ఛేదింపఁబడి జ్ఞానసిద్ధి వచ్చు
ఏ యుపాసన చేత మాయాతమోరాశి
విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు సతము
యే నిష్ఠచేత విజ్ఞాన సామ్రాజ్యంబు
అడుగు మోపిన చోటఁ బడయనగును
అట్టి బ్రహ్మవిద్య నాదర్శముఁగ జేసి
పాప తాప భయనివారకంబు
నైన మానసికమునైనట్టి శక్తి గ
డింపవలయు మృతి జయింపవలయు.