ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 198| 1st November 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 198
- శ్రీమతి దాసం మాధవి, ఉరదాళ్ళపాలెం
- శ్రీమతి కొండవీటి విజయ దుర్గ, అత్తిలి
406 వ పద్యం
చ. జగమున కేది హేతువొ నిజంబుగ నేరును చెప్పలే రవే
నిగమములై మతంబు లయి నిర్భరదాస్యములై క్రమంబుగా
మిగిలిన జాతి జీవనపు మేరువు దండమె గూల్చివైచె నీ
పగిది తుఫానులన్ సుడులపాలయి దేశము గొడ్డువోయెడున్.
407 వ పద్యం
శా. విద్యా లేదు కళా ప్రపంచమునఁ బ్రావీణ్యంబులా సున్న సం
వేద్యంబైన నిజాత్మ తత్త్వకలనావిర్భూత విజ్ఞానవై
శద్యంబుల్ గగనాభముల్ ధనము రాజ్యం బర్థసంస్కార సం
పాద్యంబుల్ మృగతృష్ణ లింక మన జీవంబుల్ వృథాభారముల్.
