Pragnanam Brahma Special Program | Promo | Sufi Vedanta Darsamu | 22nd Jan 2022

శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము షష్ఠ పీఠాధిపతులు డా.ఉమర్ ఆలీషా వారు గొప్ప తత్త్వవేత్త . వీరు రచించిన #సూఫీవేదాంతదర్శము గొప్ప తత్వసంహిత. పాఠకుల హృదయంలో మరో భగవద్గీత రూపంలో చిరస్థాయిగా నిలిచిన గొప్ప ఉద్గ్రంథం.
పరమాత్మ స్వరూపమును అంతటా చూడడం కోసం వివిధ సాధనామార్గాలను ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు. తన మోక్షము తన చేతుల్లోనే ఉంది, దాన్ని సులువుగా అందేలా చేయడమే ఈ గ్రంథం యొక్క ముఖ్యాశయము. ఈ సృష్టిలో ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే వివేకాన్ని కలిగించి మనస్సుకు స్థిరత్వాన్ని కలుగజేస్తుంది ఈ గ్రంథము.
ప్రస్తుత ఆధునిక జీవన విధానాన్ని గడుపుతున్న మనందరికీ ఈ పద్యాలు చక్కని మార్గనిర్దేశకాలు. ఆనందకరమైన తాత్త్వికజీవనాన్ని గడిపే విధంగా మనలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం సాయంత్రం 7 గం.లకు సూఫీవేదాంతదర్శము పద్యాలను సులువుగా అర్ధం చేసుకొనే విధముగా #ప్రజ్ఞానంబ్రహ్మ గా ఒక సదస్సును సద్గురువర్యుల దివ్యాశీస్సులతో 2022, జనవరి 22వ తేది నుండి నిర్వహించుకోబోతున్నాము.

You may also like...