ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 63| 1st April 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 63
వక్తలు :

  1. శ్రీమతి కేశవరపు లక్ష్మి, అచ్చంపేట
  2. శ్రీమతి నున్న భవాని, నెల్లూరు

133వ పద్యము
అనలము దహ్యమాన మయినప్పుడు లేచెడు విస్ఫులింగముల్
ఘనతరజ్వాలలం గలిపి కన్నుల ఱెప్పలు మూయకుండఁగా
మనసును నిల్పి బ్రాహ్మికసమాధిని జూచిన యజ్ఞపూరుషుం
డినుఁడు నుషస్సుహాయనము లీశ్వరజీవులఁ గాననయ్యెడున్.

134వ పద్యము
పాఱెడు నీర మేరయిన ప్రాణము వచ్చును దానిలోన వి
స్ఫారరసస్వరూప సముపాసిత తేజము వచ్చు నాకళా
భారతె గంగ స్వర్ధుని నభంబున లేచిన రీతి రేచకా
ధారముచే విలాసమతి దాఁటగవచ్చును మాటలాడుచున్.

You may also like...