ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 98| 02nd December 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

వక్తలు :

  1. శ్రీమతి బొల్ల శ్రావణి, ఏలూరు
  2. శ్రీమతి ఇళ్లా వెంకటలక్ష్మి, కాట్రావులపల్లి

203 వ పద్యము
ప్రణవము పాడుచున్ హృదయ వాసనలన్ గదలించి వైచి నీ
వణగిన నా సుషుమ్న లవమైనను వెల్తురుచేతఁ బెద్దదై
కనపడు తత్ప్రకాశమునఁ గానఁగవచ్చును నీవు నీశ్వరుం
డను నమృత స్వరూపముల నాహతమందు నభంబు దోఁపగన్.

204వ పద్యము
బాలుఁడు మాటలాడుటకుఁ బాల్పడునప్డు మనస్సులోన నే
వేళకు నేది తోఁచునది వెల్లడి సేయును గాన నీవు నీ
ఫాలము నేల మోపి గనవచ్చెడు త్రోవకుఁ గన్నులెత్తి పో
జాలిన జీవు నీశ్వరు నుషస్సును సృష్టిని చూచెదాయెడన్.

You may also like...