ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 17| 14th May 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 17

వక్తలు :
శ్రీమతి యర్ర అనంత లక్ష్మి, హైదరాబాద్
శ్రీమతి కూత ఉమా శ్రీ వినయవతి, విశాఖపట్నం

35వ పద్యము.
సాధించితిని యోగ సాధనంబులు హిమా
గమమెక్కి మతిని చక్కాడియాడి;
బోధించితిని జ్ఞాన సాధనక్రమములు
చెవినిల్లుగాఁజేసి చెప్పి చెప్పి;
సవరించితిని పెద్ద సారస్వతంబును
శబ్దశాస్త్రంబులు జదివి చదివి;
చూపించితిని రాజ్యలోపంబు లాంగ్లప్ర
భుత్వంబు ముంగర మోపి మోపి
ఇప్పుడప్పుడె నలువదియేండ్లపైన
దాఁటిపోయెను వయసు నీనాఁటికైన
శాంతి గలుగదు నీ కళాధ్వాంతమందు

36వ పద్యము
నను నీ జ్ఞానమహాసభాసదులు నానందాననర్థించి ఆ
దిని మీ పూర్వపితామహుల్ గురువులై దివ్యత్వ మేపారఁగా
ఘనవిజ్ఞానకళాప్రవృష్టి ప్రజహృత్కాంతారముల్ నింపిరా
మని మీరాకృతి బోధసేయఁదగు “ఉమ్రాలీష” భాషాగతిన్.

You may also like...