ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 79| 22nd July 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 79
వక్తలు :

  1. శ్రీమతి పెరుమల్ల కవిత, హైదరాబాద్
  2. శ్రీమతి దాలిపర్తి సత్యవతి, కాకినాడ

165 వ పద్యము
దండకమండలంబులు ప్రదర్శితమైన జటావశేష దో
ర్దండకషాయచేలములు దాల్చి తపస్సున నిల్పి చూచు బ్ర
హ్మాండము నీ నిశీథి తెఱ కావల మాటయియున్న వెల్గు నీ
కుండలి శింశుమారమునఁ గూర్చినఁ గానఁగవచ్చు నేయెడన్.

166 వ పద్యము
తావళముల్ తపస్సునకుఁ దావలమైనవటన్న మాటలో
భావము తెల్ల మెల్లరకు స్వర్గము నా యమృతంబు దేవతల్
కావలెనన్నఁ బెద్ద యధికారము కావలె నందు శక్తి బీ
రోవును గాన ఖడ్గమొకటుంచు తపస్సున జ్ఞానసిద్ధికిన్.

You may also like...