ది.18 జనవరి 2020 శనివారం తాడేపల్లిగూడెం టౌన్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కొబ్బరితోట నందు గల శ్రీదేవీ మహంకాళి అమ్మవారి సన్నిధి లో ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది

ది.18 జనవరి 2020 శనివారం తాడేపల్లిగూడెం టౌన్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కొబ్బరితోట నందు గల శ్రీదేవీ మహంకాళి అమ్మవారి సన్నిధి లో ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ అలీషా గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు గౌరవనీయులు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారు మరియు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ యెగ్గిన నాగబాబు గారు సత్కరించినారు. సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేసినారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ యెగ్గిన నాగబాబు గారు, తెలుగు సాహితీవేత్త ప్రముఖ కవి శ్రీ ఎస్.అర్.భల్లం గారు, కైండ్ నెస్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గట్టిం మాణిక్యాలరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు గౌరవనీయులు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారు ప్రసంగించినారు. శ్రీ గజల్ శ్రీనివాస్ గారు స్వామి ని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొన్నారు.

సద్గురువర్యులను సత్కరిస్తున్న మాజీ మంత్రివర్యులు మరియు ఆలయ కమిటీ

News Clippings

You may also like...