ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 34| 10th September 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 34
వక్తలు :

  1. శ్రీమతి గుడిపుడి శేషుకుమారి, హైదరాబాద్
  2. శ్రీ అల్లూరి రమేష్ వర్మ, రాజమండ్రి

72 వ పద్యము
జీవచైతన్యమును మార్చి చిత్త మేర్చి
దృక్కు నార్చి నాపోజ్యోతి తేటుగూర్చి
చీకఁటివెలార్చి జగము నిర్జింపఁగలరు
జ్ఞానసభ్యులు లోకవిఖ్యాతు లగుచు

73 వ పద్యము
అతిపవిత్రతతో మహాప్రేమగరిమతోఁ
గ్రాలెడు వీరె చుట్టాలు మాకు
ప్రాణార్థములనైన ప్రాభవంబులనైన
నిచ్చెడు వీరె స్నేహితులు మాకు
జ్ఞానసాధనచేత ధ్యాననిష్ఠలచేతఁ
దనరెడు వీరె సోదరులు మాకు
పూజ్యభావమునందు పుణ్యశీలమునందు
వర్ణింప వీరె దేవతలు మాకు
వీరె చేఁదోడు వాదోడు వీరె మాకు
వీరె ముఖ్యులు తల్లులు వీరె మాకు
వీరె భక్తులు బిడ్డలు వీరె మాకు
మా మహాజ్ఞానసభ జగన్మందిరముగ.

You may also like...