ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 97| 25th November 2023
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
వక్తలు :
- శ్రీ కట్రెడ్డి షాబాబు, తాడేపల్లిగూడెం
- శ్రీ యర్ర గిరిబాబు, అమెరికా
201వ పద్యము
వామాచారము నీతిబాహ్యము నసభ్యత్వంబు వర్జించి వి
ద్యామర్యాదను సిద్ధయోగముల నభ్యాసంబు గావించితే
యా మార్గంబు లభించు నా తెలివిలోఁ జూపట్టు విశ్వస్వరూ
పామార్తాండఖగోళరోదసికనత్ స్వర్గైక పాతాళముల్
202వ పద్యము
నీలోనున్నవి లోకజాలములు మున్నీ నుండి బాహ్యంబుగా
నాలోకించెదవేల! వీనికి స్వతంత్రాభీష్ట వృద్ధిక్షయా
భీలంబైన స్వశక్తి లేదరయ హృద్వీథిన్ బ్రపంచించి నీ
వాలోకంబునఁ జూడనేర్తువదె బ్రహ్మానందసంధాయివై