Sabha was conducted at Nagulapalli Upparagudem on 12th Jan 2024

Press note. నాగులాపల్లి ఉప్పర గూడెం. 12-1-24
క్షణికావేశాన్ని నియంత్రణ చేసేదే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానమని డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. శుక్రవారం సాయంకాలం నాగులాపల్లి ఉప్పర గూడెం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సు కు పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి వారు అధ్యక్షత వహించగా, నాగులాపల్లి సర్పంచ్ శ్రీమతి వడిసెట్టి గౌరీ రాజేశ్వరి అతిథిగా వచ్చి ప్రసంగించారు. శ్రీమతి రాజేశ్వరి మాట్లాడుతూ ప్రేమ తో భగవంతుని ఆరాధిస్తే ఆశీస్సులు పొందగలమని అన్నారు. అనంతరం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారిని శ్రీమతి గౌరీ రాజేశ్వరి శాలువా కప్పి సత్కరించారు. ఈ సభలో తాత్విక బాల వికాస్ బాల బాలికలు మాస్టర్ నంద్యాల యశ్వంత్, సన్నిబోయిన ఉషా కిరణ్, తేజ అశ్వని, ఉమా నవీన్, ఉమా కృష్ణ ప్రసాద్, సన్నిబోయిన కిరణ్, గంగా లలిత, ఉమా గౌరీ, పెద్ద అప్పన్న సభలో ప్రసంగించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. ముఖ్యంగా మాస్టర్ నంద్యాల యశ్వంత్ ను స్వామి శాలువా కప్పి అభినందించారు. ఆశ్రమ సుందరీకరణ లో త్యాగం చేసిన శ్రీ సన్నిబోయిన వెంకట్రావు శ్రీమతి వెంకయ్యమ్మ దంపతులను స్వామి శాలువా కప్పి సత్కరించారు. గ్రామ సభ్యుల తరపున శ్రీ జక్కి వెంకటరెడ్డి, జక్కి శ్రీనివాస రావు, జక్కి సోమరాజు స్వామి వారిని శాలువా కప్పి సత్కరించారు. హారతి తో సభ ముగిసింది. సుమారు 900 మంది స్వామి వారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
ఇట్లు
పెరూరి సూరిబాబు,
కన్వీనర్,
98489 21799.

You may also like...