ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 74| 17th June 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 74
వక్తలు :

  1. శ్రీమతి దంతులూరి రూపిణి, బెంగళూరు
  2. శ్రీమతి మేడిబోయిన మల్లేశ్వరి, రాజమండ్రి

155వ పద్యం
పిలుపులు వచ్చు దూరముగఁ బిల్చెడు వారి పథశ్రమంబులన్
దలఁచిన వేళ తద్ధ్వనులు తాకెడు సౌష్టవ మభ్యసించు మా
తెలివిని స్వర్గసౌధముల తెన్నునఁ బోవఁగనిచ్చి యందులో
వెలుతురు జేర్చితేని నది విశ్వము చూచు వచించు సర్వమున్

156వ పద్యం
గీతలు గీసి గుండ్రముగఁ గేంద్రము జేసిన దృష్టిచేత నీ
చేతము నిల్పితేని కడు చిత్రముగాఁ గనిపించు దృశ్యసం
జాతము స్వప్నతుల్య మది జాగ్రతయందు ఘటించు నందులో
భూతభవిష్యదర్థములు బోల్చఁగవచ్చు జనంబు కోరినన్

You may also like...