ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 67| 29th April 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 67
వక్తలు :

  1. శ్రీ యర్రంశెట్టి శివన్నారాయణ, బల్లిపాడు, ప.గో.జిల్లా.
  2. శ్రీ వింజరపు విజయ్ బాబు, పిఠాపురం

141 వ పద్యము
చూపులు మాఱకుండ నిజశోభిత సృష్టివిలాస మీజగ
ద్రూపము ముందరన్ నిలిపి రూపరకుండఁగ చూచెనేని యీ
రూపము మాఱి యేదొ యపురూపపు దృశ్యము వచ్చి యందు నీ
రూపము నీశ్వరుండనెడు రూపము నేకముగాఁగఁ దోచెడున్.

142 వ పద్యము
పాఱు నదీజలాన పొలుపారు జగత్ప్రతిబింబమందు నీ
తోరపు నేత్రదృష్టి నిడుతోడనె యా బడబానలంబు శృం
గార రసానుభూతిమయి గానఁగవచ్చును యజ్ఞపూరుషా
కారము దాల్చి యా మఱుఁగు గాననివారికి ముక్తి యున్నదే.

You may also like...