25th Anniversary Spiritual Meeting at Tuni on 07 March 2022

మార్చి 7 తేదీ 2022 సోమవారం తుని లో 25వ వార్షిక ఆథ్యాత్మిక మహాసభ నిర్వహించబడినది

ప్రెస్ నోట్
మానవత్వపు విలువలతో కూడిన జీవన తత్వాన్ని అలవరుచుకుని సమాజంలో సుఖంగా, శాంతిగా జీవించాలని డా. ఉమర్ అలీషా స్వామి పిలుపు నిచ్చారు. శాస్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మికత తోడయితే, మానవ కళ్యాణము ఏర్పడుతుందని అన్నారు. మానవ వికాసాన్ని ప్రసాదించేదే ఆధ్యాత్మికత, మానవ వినాశనాన్ని సృష్టించేదే, అభద్రతా భావం, అశాంతి, ద్వేషం అని డా. ఉమర్ అలీషా స్వామి అన్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య 12 రోజుల నుండి జరుగుతున్న యుద్ధానికి ప్రధాన కారణం అభద్రతా భావం, అసహనం, అశాంతి, ద్వేషం కారణాలని డా. ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. ఆధ్యాత్మికత లోపించుట వల్లే నేటి సమాజంలో అశాంతి, అభద్రతా భావం, ద్వేషం ఏర్పడుతున్నాయని డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. సోమవారం ఉదయం తుని చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహెన్ షావలీ దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రజతోత్సవ వేడుకలకు ప్రస్తుత పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అధ్యక్షత వహించగా, వివిధ మతాధిపతులు వేదిక నలంకరించి ప్రసంగించారు. హిందూ మత ప్రతినిధి డాక్టర్ ఎల్.ఎస్ యాజ్ఞ వల్క్య శర్మ, ఇస్లాం మత ప్రతినిధి షేక్ అహ్మద్ జాని, క్రైస్తవ మత ప్రతినిధి బిషప్ పి. నటరాజన్ లాజరస్, భౌద్ధ ధర్మ ప్రతినిధి శ్రీ పిల్లి రాంబాబు, జైన మత ప్రతినిధి శ్రీ భవర్ లాల్ జైన్, సిక్కు మత ప్రతినిధి శ్రీ గురు చరణ్ సింగ్, బ్రహ్మ కుమారి మాధవీ లత, ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ మెంబెర్ శ్రీ సోని వుడ్, వేదిక నలంకరించి ప్రసంగించారు. తుని మునిసిపల్ చైర్మన్ శ్రీ ఏలూరు బాలు గారు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ కొరకు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి 90 మొక్కలు పంపిణీ చేశారు. పక్షుల చలివెంద్రం కొరకు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి ధాన్యపు కుచ్చులను వాలంటీర్లు అబ్బిరెడ్డి అనూష, బండి శ్రీనివాస్ కు అందచేసారు.
విశ్వ కార్డులను తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ జి. రమణ, పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ ఏ.యెన్ వెంకటరత్నం గార్ల కు పీఠాధిపతి డా. ఉమర్ అలీషా స్వామి అంద చేసారు.
నోబుల్ ఐ.టి.ఐ కరెస్పాండంట్ శ్రీ గోసుల సత్యనారాయణ ఆహ్వానం పలికారు, పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. తుని కమిటీ సభ్యులు పీఠాధిపతి డా. ఉమర్ అలీషా స్వామి వారిని రజతోత్సవ వేడుకలు సంధర్భంగా సన్మాన పత్రం చదివి, శాలువ కప్పి, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తుని మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు శ్రీ ఏలూరు బాలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ కలిదిండి సత్యనారాయణ రాజు, బి.జె.పి నాయకులు శ్రీ తోట నగేష్ స్వామి వారిని దర్శించుకొని ప్రసాదం స్వీకరించారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్

Paper Clippings

You may also like...