ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 22| 18th June 2022
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 22
వక్తలు :
- కుమారి పల్లపు ఉమా మహేశ్వరి, ప్రగతినగర్, హైదరాబాద్
- శ్రీ బత్తుల తరుణ్ కుమార్, రాజమండ్రి
- శ్రీమతి కుచ్చర్లపాటి గౌరి ప్రియ, హైదరాబాద్
45వ పద్యము.
మా తాతయు మా తండ్రియు
ఖ్యాతిని ఆఖైలలీ మహాగురువర వి
ద్యాతత్త్వము నేర్చిరి త
ద్రీతుల వివరింతు యోగరీతులు తెలియన్.
46వ పద్యము
ఎల్లరు జెప్పుచుండి రల యీశ్వరుఁడీవని మీరుఁగూడ నా
కల్లలు బొల్లులల్లి కథగా నిటుకల్పనఁ జేసి చెప్పఁగా
నొల్లునె యంచు మీర లననోపుదురేమొ తదీయ వాస్తవం
బెల్ల రహస్యమున్ దెలిపి యద్భుతమార్గము విప్పి పెట్టితిన్.
47వ పద్యము
కనదుద్ పాదరసంబు తాత్త్వికుఁడు బంగారంబు గావించు న
ట్లనుమానాస్పదమై వినాశకరమై యల్లాడు జీవుండు బ్ర
హ్మనుగా మార్చెడు త్రోవఁజూపితి నిది ధ్యానంబు సంధించి మీ
కనులన్ విప్పుడు శూన్యమందు హరిసంకాశంబు సంధిల్లెడున్.