ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 6| 26th Feb 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 6

వక్తలు:
శ్రీమతి కె. స్వర్ణలత, హైదరాబాదు
శ్రీమతి సి. శారద, హైదరాబాదు

పద్యము – 7
ఏమని నిన్ను గొల్చుటకు నీశ్వర! నీ యపురూప తేజ మే
మేమని చెప్ప నేర్తు మిద మిత్థ మటంచు సమస్త లోకముల్
నీ మహనీయతేజమున నేర్పడుచున్నవి నిన్నె‍ఱుంగగా
లేము నుతింపలేము గనలేము తపంబులు వేయి చేసినన్

పద్యము – 8
నీవే యాచషకంబు నీవె మధువానిర్వ్యాజతేజస్వరూ
పావిర్భావము నీవె దాతవు తదీయంబైన మైకంబులో
నీవే నంచు వివాద వీచికలలో నెంతే ప్రభిన్నాత్ములై
పోవం జూచుచునుంటి మెంతయు నినున్ బూజింపలే కీశ్వర!

You may also like...