ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 43| 12th November 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 43
వక్తలు :

  1. శ్రీమతి సామంతుల లక్ష్మి, విస్సాకోడేరు
  2. శ్రీమతి పింగళి మంజుల , విశాఖపట్నం

92 వ పద్యము
ఏల పటప్రదర్శనము లేల వికారపు నాటకంబు లిం
కేల హృదంతరాళమున నీశ్వరసృష్టి చరాచరంబు లా
లీల నటింపుచుండ నవలీల యథావిధి వారితోడ నీ
కాలముబుచ్చకీ ప్రకృతి కర్మల కల్మషమేల జ్ఞానికిన్.

93వ పద్యము
జ్ఞానము నిండు ప్రేమను నకల్మష మాత్మసమర్పణంబులో
గానఁగవచ్చు నా ప్రణయగానము నన్నిట నాలకించువాఁ
డే నిజమైన యోగి యతఁడే విభుఁ డీశ్వరుఁడున్న గొప్ప యా
స్థానమునందు నిల్చి ప్రమదంబునఁ జాటును ముక్తకంఠుఁడై.

You may also like...