ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 76| 01st July 2023
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 76
వక్తలు :
- చిరంజీవి కుచ్చర్లపాటి సాయి కౌశిక్ వర్మ, హైదరాబాద్
- శ్రీ దిడ్డి జయరావు, విశాఖపట్నం
159 వ పద్యము
ఏదే నొక్క రహస్యమున్ దెలియఁగా దృష్టిన్ బ్రదీపించు నిం
కేదేనిన్ గని మాటలాడునెడలన్ హృద్వీథి నా వస్తువా
పాదింపందగు దానిలో వెలుఁగు సంపాదించి నోరిచ్చి నీ
వాదారిన్ జని పల్కరించుమది స్వేచ్ఛాసక్తి భాషించెడున్.
160 వ పద్యము
ఏదియు రాదటంచు నెద నేయది రోయకు దానియందె నా
మోదము లక్ష్యముంచి పొరపొచ్చెము మాని పఠించితేని నీ
కేదయినన్ లభించును నిదే జడతత్త్వరహస్యమిందు జ
న్మాదిపురాకృతైక సుకృతార్థ మగత్యము గాదు చూడగన్.